![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు' ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -123 లో...నన్ను పట్టించుకోవడం లేదు. ప్రమాదం నుండి బయటపడితే కనీసం దిష్టి కూడా తియ్యలేదని రామలక్ష్మి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. దాంతో చెయ్యలేక శ్రీలత వెళ్లి హారతి తీసుకొని రా అని శ్రీవల్లిని పంపిస్తుంది. అందరు కలిసి ఈ లేడీ విలన్ ని పనిమనిషి చేశారని శ్రీవల్లి నసుగుతు వెళ్తుంది. స్వామి గారు ఏం చెప్పారు సీతా అని శ్రీలత అడుగుతుంది. అత్తయ్య.. నా చుట్టూ కొన్ని దుష్టశక్తులున్నాయట జాగ్రత్తగా ఉండమన్నారు.. జాగ్రత్త గా ఉండడమేంటి వాటి భరతం పడతానని చెప్పానని రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లకి హారతి ఇచ్చి లోపలికి రమ్మని సిరి చెప్తుంది. మీ తల్లి కపటప్రేమని మీకు తెలిసేలా చెయ్యాలి అందుకే ఈ ఇంట్లో అడుగుపెడుతున్నానని రామలక్ష్మి అనుకుంటుంది. ఇంట్లోనే కాదు నరకంలో కూడా అడుగుపెట్టావని ప్రత్యేక్షంగా అర్థం అయ్యేలా చేస్తానని శ్రీలత అనుకుంటుంది. మొదటిసారిగా ఈ ఇంట్లోకి అడుగుపెడుతున్నావ్ అన్నట్టు అనిపిస్తుందని పెద్దాయన అంటాడు. అత్తయ్య గారు నన్ను సౌభాగ్యవ్రతం చేయమని చెప్పారని శ్రీలతతో రామలక్ష్మి చెప్తుంది. ఇంకొకటి కూడా చెప్పారు.. నన్ను ఈ ఇంటికోడలిగా ఇంట్లో నుండి ఏ దుష్టశక్తి పంపించలేదని చెప్పారు.. రేపు పూజకి అన్ని ఏర్పాట్లు చెయ్యండని రామలక్ష్మి చెప్తుంది. వద్దు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నావ్ .. ఉపవాసం ఉండాలి.. అవన్నీ ఎందుకని శ్రీలత అంటుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను పూజకి ఏర్పాట్లు చేయండని శ్రీలతకి రామలక్ష్మి చెప్తుంది. అవును ఏర్పాట్లు చెయ్యండి అని సీతాకాంత్ కూడా అంటాడు. సీతాకంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి మాట్లాడతాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంది అనే ఫీలింగ్ బాగుందని చెప్తాడు. ఈ హ్యాపీ మూమెంట్ లో ఎంప్లాయిస్ కి రెండు నెలల జీతం బోనస్ గా ఇవ్వండి అని సీతాకాంత్ చెప్తాడు.
ఆ తర్వాత ఆ మాట శ్రీవల్లి విని బావగారు ఎంప్లాయిస్ కి బోనస్ ఇస్తున్నాడంట.. అలా డబ్బులన్నీ ఖర్చుపెడితే మన పరిస్థితేంటని శ్రీలత, సందీప్ లతో శ్రీవల్లి అంటుంది. అసలు రామలక్ష్మి మనం అభితో కలిసి ప్లాన్ చేశామని తెలిసే ఇలా చేస్తుందో కనుక్కోవాలని శ్రీలత అంటుంది. మరొకవైపు సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. నువ్వు పరిచయం అయినప్పటి నుండి నేను నిన్ను ఇష్టపడుతున్నానని సీతాకాంత్ చెప్తాడు. మరి ఎప్పుడు చెప్పలేదని రామలక్ష్మి అంటుంది నన్ను తప్పుగా అనుకుంటావని చెప్పలేదు.. ఇప్పుడు చెప్పాలని ఉందని రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ అని చెప్తాడు దాంతో రామలక్ష్మి సిగ్గు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |